______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

ఇష్టములు (ముచ్చటలు)

నాకు
గులాబీ పువ్వులు అంటే ఇష్టము.
అదీ గులాబీ రంగు గులాబీ పువ్వులు అంటే మరీ ఇష్టము.
పైగా నిండుగా విచ్చుకున్నవాటి తాజా రేకులు అంటే మరీ ఇష్టము.
వాటిని గుప్పెడు నిండా నింపి నమిలేయడము అంటే మరీ ఇష్టము.
ఇన్ని ఇష్టముల చెంత
ఉదయమే
ఆ పువ్వు కింద అంచున ఉన్న ముళ్లు 
అబ్బా అనిపించగానే,
ఆ పువ్వు 
అమ్మా అన్నట్టు
నా మనసు గ్రహించగానే
నా పై ఇష్టములు
ఒక్కమారుగా
పటాపంచలైపోవడము
ఎంతో ముచ్చటై
ఆ ముచ్చటను ఇలా మీతో ముచ్చటించుకోవడము
అదీ
ఈ బ్లాగ్ 200వ టపా కావడము
గొప్ప ఇష్టముగా మిగిలిపోబోతోంది...
నిజముగా...
ఎప్పటికీ, ఎన్నటికీ
నాకు.