______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

ప్రశ్నలు రెండే (కథ)


బొమ్మ : శ్రీ బాపు
... ...

... మధు నా ఆలోచనల్లో చిక్కుకుంది ...
మధు ... మధు ...
మధు నా ప్రాణం ...
తన పేరు మధురిమ. అయినా, నేను మధు అని పిలిస్తే, తన కానందమట ... అని చెప్పిందా రాత్రి ...
ఆ రాత్రి - మాకు తొలి రాత్రి ...
మంచంకు కొంచెం దూరంలో నించున్న మధురిమను దగ్గరగా లాక్కున్నాను ... అప్పుడే, ఆమె కుడి చేతి మండ మీద ముద్దు పెట్టాను ...
"ఏమని పిలవమంటావ్" అడిగాను, మాటలు కలపాలన్న ఉద్దేశ్యంతో.
మౌనం.
"చెప్పు, ఏమని పిలవమంటావ్"
ఆగి, చెప్పింది - "మీ ఇష్టం"
"సరే, మీ ఇష్టం"
చిరునవ్వు.
నేనూ నవ్వేను, చిన్నగా.
"మధురిమ అనే అంటారంతా, మరి మీరు ..."
"మధు ... అంటాను" చెప్పాను.
ఆమె చిన్నగా తలాడించి, "బాగుంది, సరే" అంది.
ఇద్దరం కౌగిలిలో కరిగిపోతున్నాం ...

* ముద్రితము : స్వాతి (మాస పత్రిక) - మార్చి, 1981