______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా వెంట గతము (కబురులు)'షిరిడి శ్రీ సాయి, మలి నమస్కారము' అని, లేచి, పూజా గది బయటకు వచ్చాను.
సమయము, ఉదయము, 6-30 దాటుతోంది ...
అప్పటికే, నా పూజా, ధ్యానము ముగిశాయి.
పిదప, ప్రతి రోజు వలె, మామూలు గానే, దిన పత్రికలు ముందేసుకొని కూర్చున్నాను.
ఆ ఒరవడిన, నేడు (12-8-14), సాక్షి ఫ్యామిలీలో, 'మీ నంబరేంటి' ద్వారా 'అంతర్జాతీయ యువజన దినోత్సవం' గా గుర్తెరిగి - అందు కబుర్లుతో నేను గతములోకి జరిగాను ... మరోమారు, మళ్లీ ...
సుమారుగా - 39 యేళ్ల క్రితము, నా 19వ యేటన (నేను పుట్టింది, 1956లో - నా తొలి రచన, 1975లో) నా తొలి కథ, పేద బ్రతుకులు 
నాలో 'రచన' ఆసక్తి రేగడానికి, రెండు ముఖ్య కారణములు -
కటి, నా తాతయ్య, మహాదేవు అప్పారావు దొర ... ఆయన ఆధ్యాత్మిక పుస్తకములు చదివించుకొని, వినేవారు, విరివిగా. ఆ వరసలో, అందుకు నేను, ఆయనకు వినియోగపడలేక పోయాను. నేను చక్కగా బయటకు చదవ లేను (ఇప్పటికీ). అప్పుడు, నా చెల్లి, చి. భారతి (బ్లాగర్, వీరి బ్లాగ్ :  స్మరణ ), ఆయనకు తగ్గట్టుగా, అందుకు వచ్చింది. అప్పుడే, మా తాతయ్య, నాతో, 'చదవ లేవు కానీ, వ్రాయ గలవేమో ప్రయత్నించు' అన్న వారి  తీరైన విరుపు.
రెండు, నా మిత్రుడు, పువ్వల రమేష్, నాతో, 'కథలు చెప్పకురా, వ్రాయరా' అన్న వాడి తెరిపిలేని పోరు.
........................................

దారిలోనే, నేను, బివిడి ప్రసాదరావు పేరున ఒక తెలుగు బ్లాగ్ నిర్వహిస్తున్నాను.
లా, నా రచనా నడకలో, ఎన్నెన్నో 'ఊతము'లు - వాటిలో కొన్ని (ఇక్కడ నా రచనలకు వచ్చిన బహుమతులు గురించి ప్రస్తావించడము లేదు. వాటి గురించి మరో మారు, మరోలా, నా కబురులు ద్వారా అందిస్తాను).
1978 ఏప్రిల్ లో - కంఠు గారు (వారిని పలకరించ గలిగే, నా చనువైన పిలుపు ఇది ... వారు ఎ.ఎన్. జగన్నాథశర్మ గారు, ఎడిటర్, నవ్య వార పత్రిక) - నా కథ ప్రశ్న చదివి, 'ఎట్టి కటింగ్ లక్కర రాని రచన' అన్నది ఒకటి ...
1981 మార్చిలో, అచ్చయిన నా రెండు కథలు (ప్రేమ, ప్రశ్నలు రెండే) గురించి, కె.కె. రఘనందన గారు (రచయిత), ఆ మధ్య, 'స్వాతి మాస పత్రికలో, ఒకే సంచికలో, ఒకే రచయిత కథలు రెండు రావడము, మీవే' అనడము ...
2003 జనవరిలో, నా కథ, హనీమూన్ చదివి, 'దాచుకొని, తిరిగి, తిరిగి చదవ తగ్గది' అన్న డా. డి. రాఘవేంద్రరావు  (విలువలు దాత, నేర్పైన కళా పోషకులు) గారి స్పందన ...
2007 ఫిబ్రవరిలో, నా కథ అనురాగం చదివి, 'దీనికి ఇంతే ముగింపు' అని, పి.వి.బి. శ్రీరామమూర్తి గారు (రచయిత) నా భుజము తట్టడము ...
'నీ కథల్లోంచి కొన్నింటితో పుస్తకము తీసుకురా' అని మంచిపల్లి శ్రీరాములు (శ్రేష్ఠమైన హితులు, చేవెక్కిన సేవాపరులు) గారు అనడము, అందుకు, 'ఎందుకు లెండి' అని నేను అన్నప్పుడు, బి.వి. రమణమూర్తి  (మేటైన సన్నిహితులు, అండైన నిండుకుండ) గారు నొచ్చుకోవడము ...
నా కథ, బొడ్డు గురించి, 'ఈ అతి చిన్న కథలో ఎంతో ఉంది' అన్న  కోడీహళ్ళి మురళీమోహన్ గారి (కథా జగత్ వెబ్ పత్రిక నిర్వాహకులు) వ్యాఖ్య ...
నా కురచ కథలు గురించి,  'బాగుంటున్నాయి' అని ఈ మధ్య, అన్న పంతుల జోగారావు (రచయిత, బ్లాగర్, వీరి బ్లాగ్ : కథా మంజరి) గారి స్పందన ...
లా, ఇంకా, ఎన్నో, ఎన్నెన్నో... 
ముఖ్యముగా, ఈ సమయమున,  సామవేది గారు (పరశువేది పిసర) ... వీరు ... బెత్తము పట్టని ప్రత్యేక, ప్రత్యక్ష, పరోక్ష నియంత ...


***