______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా 1వ eBook (కబురులు)ముందుగా మీకు నా ధన్యవాదములు. నిన్నటి నా టపాకు మంచి స్పందన వచ్చింది. ఆహ్లాదకరమైన ఆనందము అందించారు. దీనికీ మళ్లీ ధన్యవాదములు. కొంత మంది ఈ-మెయిల్స్ ద్వారా, కొంత మంది మొబైల్స్ ద్వారా, కొంత మంది తమ, తమ అందుబాటుల ద్వారా, ఈ నా eBook గురించి, తమ స్పందనలు తెలియచేశారు. వీటికీ మళ్లీ, వారికీ ధన్యవాదములు. 

కొద్ది మంది, కొన్ని వాకబులు చేశారు. వాటికి ఈ జవాబులు ... మిగతా వారికి, అందరికీ ఉపయోగపడేలా, జవాబులు ఇచ్చే ప్రయత్నము చేస్తున్నాను -


  • ఈ నా eBook ను అన్ని రకముల మొబైల్ ఫోన్స్ నుండి చూడవచ్చును. అందుకు ఆయా ఫోన్ ల బట్టి, iBooks, eBook Reader, Marvin ల్లాంటి అఫ్లికేషన్స్ ముందుగా, ఆయా ఫోన్ ల, అప్లికేషన్ స్టోర్స్ నుండి  ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఐతేనే, eBooks ను పుస్తకము మాదిరిగా పేజీలు తిప్పుకొని చూడగలరు.

  • ఈ  నా eBook ను డిష్కుటాప్, లాపుటాప్, టాబ్ లెట్స్ ల్లాంటి వాటిల్లో కూడా చూడవచ్చును. అందుకు వాటిల్లో Book HD  ల్లాంటి అప్లికేషన్స్ ముందుగా, ఆయా కంప్యూటర్ల స్టోర్స్ నుండి ఇన్స్టాల్ చేసుకోవాలి. (ముందుగా ఇన్స్టాలై లేనిచో). ఇలాంటి అప్లికేషన్స్ తో, eBooks ను పుస్తకము మాదిరిగా పేజీలు తిప్పుకొని చూడ వచ్చును.

  • ఇంటర్ నెట్ అవసరము, కేవలము, eBook డౌన్ లోడ్ వరకే అవసరము. ఒక సారి నెట్ ద్వారా, eBook మనకు కావలసిన డివైజ్ ల్లోకి డౌన్ లోడ్ ఐపోతే, ఇక ఆఫ్ లైన్ (నెట్ అవసరము లేకుండానే), ఎప్పుడు కావాలంటే అప్పుడు eBooks ను చూసుకోవచ్చును. అవకాశము మేరకు చదివి ఆపుకోవచ్చు. తిరిగి, మనము చదవాలనుకుంటే, మొదట ఎక్కడ ఆపేమో, అక్కడ మొదలు చదువుకోవచ్చు.
ప్పుడు, ఇక, నా eBook గురించి -

  • Apple ఛానల్ ద్వారా కూడా ఇకపై, డౌన్ లోడ్ చేసి, అట్టి పెట్టుకోవచ్చు. చదువుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ - Apple ప్రొడక్టు (iPhone, iPad, Apple బేస్డ్ కంప్యూటర్స్, లేప్ టాప్ ల్లాంటి) యూజర్స్ కు - క్లిక్/టచ్ చేయండి.

  • Page Foundry ఛానల్ ద్వారా కూడా డౌన్ లోడ్ చేసి, అట్టి పెట్టుకోవచ్చు. చదువు కోవచ్చు. ఈ లింక్ సుమారుగా అన్ని రకాల ఫోన్స్ / కంప్యూటర్స్ రకాలకు పనికి వస్తోంది.  దానికి సంబంధించిన లింక్ - క్లిక్/టచ్ చేయండి.
ప్రస్తుతము, Kothamasu Inc., USA (పబ్లిషర్స్) వారు నా eBook ను ఉచితముగా అందిస్తున్నారు. త్వరలో, వెల పెట్టనున్నారు. అదీ వారి సర్వీస్ లకు తగ్గట్టుగానే వసూలు చేయనున్నారు. ఇందుకు, ఈ సడలింపు ఇచ్చినందుకు, వారికీ మరో మారు ధన్యవాదములు.
రో మారు, మీకు నా ధన్యవాదములు. మీ ప్రోత్సాహము తిరిగి, తిరిగి కోరుకుంటున్నాను. eBookలను, పుస్తక పఠనమును కలకాలము నిల్పడములో  సహాయ పడమని మిమ్మల్ని ప్రత్యేకముగా కోరుచున్నాను.


***