______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

నా ప్రేమ కథలు (ముచ్చటలు)


... ...

ఆ రోజు -
"ఏంటి, నువ్వు కథలు వ్రాస్తుంటావా" అడిగింది పూర్ణిమ, నా చేతిలోని అప్పుడే  పోస్టులో వచ్చిన పుస్తకాన్ని అందుకుంటూ. 
ఆ పుస్తకంలో, నేను వ్రాసిన కథ పడింది. ఆ విషయం చెప్పాను పూర్ణిమతో. ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది.
పుస్తకంలో, ఆ పేజీలో, నా పేరు, కథ పేరు చదివి -
"అబ్బ, నువ్వు కథలు ఎప్పటినించి రాస్తున్నావ్" అడిగింది పూర్ణిమ.
"ఇంటర్ మీడియట్ లో ఉంటున్న రోజుల్లోనే" చెప్పాను.
"ఎన్ని పడ్డాయి ఇప్పటికి" పూర్ణిమ.
"ఇది పదోది" నేను.
"అవునా. ఇంకా వ్రాయి. ఎక్కువ వ్రాయి. నీ కథలు ఎన్నెన్నో పడాలి" అంది పూర్ణిమ అదోలా. 
నాకు నవ్వొచ్చింది ఎందుకో. చిన్నగా నవ్వేశాను.
పూర్ణిమ నా కథల గురించి అంతగా మక్కువ పడుతూంటే, నా కెంతో ఆనందం గా ఉంది.

... ...

ఆ రోజు -
నేను రూంలో ఉన్నాను. నా మనసు ఏమీ బాగాలేదు.
పూర్ణిమ వచ్చింది. నా కెదురుగా నేల మీద కూచుంది.
"ఏంటలా ఉన్నావ్" అడిగింది.
"ఎలా ఉన్నాను" అడిగాను.
"అదోలా"
"అంటే"
"అంటే ... ఏమో బాబూ, నీలా నేను మాటలాడలేను"
నేను మాట్లాడలేదు.
"చెప్పు, ఏంటలా ఉన్నావు" పూర్ణిమ అడుగుతోంది.
"ఏమీ లేదు అన్నానుగా" చెప్పాను.
"నేన్నమ్మను" టక్కున అంది పూర్ణిమ.
"ఎలా చెప్పమంటావు" ఆగి, అడిగాను.
"బాగుంది, నోటితో" గమ్మున అంది పూర్ణిమ.
అంత బాధలోనూ పూర్ణిమ మాటలకు నాకు నవ్వు వచ్చింది. చిన్నగా నవ్వేశాను. నాకు తెలుసు, ఆ నవ్వులో జీవం లేదని.
"అది ఏదోలా అలా నవ్వుతూ ఉండాలి. ఇంతకీ సంగతేమిటో చెప్పు"

మిగతాకై క్రింద క్లిక్/టచ్ చేయండి... 

* ముద్రితము : స్వాతి (మాస పత్రిక) - మార్చి, 1981

***