______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

యోగ యోగము (ముచ్చటలు)

క్తములో ఉన్న కర్బనము (కార్బన్-డై-ఆక్సైడ్) ను హరింప చేసి, ఆమ్లజని (ఆక్సిజన్) ని పెంచి, తద్వారా, జీవి, తన కార్యకారణ శృంఖలము నుంచి విముక్తి చెంది, తన శారీరక, మానసిక శాంతిని పెంపొందింప చేసే క్రియ, యోగ.
యోగ, వివిధ విధములు. అందులో, అతి ప్రాచీనమైనది, యోగ్యమైనది, అన్ని విధములు లోనూ, తుది ఫలితముగా నిల్చేది క్రియా యోగ.
క్రియా యోగ, నిరంతరమైన,  నిక్కచ్ఛైన ఒక ప్రక్రియ.
ఈ ప్రక్రియ, జీవికి నిత్య అవసరము, అదిన్నూ,  తనకు తెలీయ కుండా సాగి పోతున్నది కూడా. అదే, ఊపిరి (గాలి) అడడము. 
గాలి పీల్చ బడడము, వదల బడడము ... ఈ క్రియ, నిత్యము, జీవిలో, తన ప్రమేయము లేకుండా జరిగి పోతోంది.  ఇది తెలిసిందే. కానీ, పట్టించుకో బడడము లేదు.
అదే, 
ఇది గుర్తిస్తే, జీవి మనుగడ, మరింత మొండుగా మెరుగవుతోంది.
ఇది గ్రహిస్తే, జీవి - నిర్జీవిల నడుమ ... కోపము, రోగము, బాధ, వ్యధ, కోరిక, పోలిక, ఆటు, పోటు ల్లాంటివి, వగైరాలు, సన్నగిల్లి, వాటి స్ధానములు ఒరిగి పోయి, ఒకే ఒకటి నిలుస్తోంది. అదే, ప్రశాంతము.
జీవి ప్రమేయము లేకుండా, ఆడే గాలిని, సరైన స్పృహ లోకి లోపర్చు కుంటే - స్వర్గ తుల్యమైన ఫలితము ఫలిస్తోంది, పరిమళిస్తోంది.
అందుకు సాధన, క్రియా యోగము - ఒక మచ్చు, ఒక ఆఖరి హద్దు.
ఆసక్తి, తనంతట తాను, తన పనులు చేసుకొనే శక్తి ఉంటే,
ఈ సాధన అతి సులభము. పైగా అట్టివారే ఈ సాధన చేపట్టాలి. 
ఇక, ఆ సాధన విధము -
సాధన సమయము అంతా మౌనము వహించాలి -
సాధన సామాన్యముగా, సౌఖ్యముగా సాగిపోవాలి -
ఒక్క మారుగా సాధించడము అత్యాశ అని తలవాలి -
సాధన ... సాధన ... సాధన ... నెమ్మదిగా, సాఫీగా, రోజు వారీగా సాగాలి, సాగించాలి -
అలసట లేనట్టి, ఆయాసము రానట్టి, నడక చేయాలి, అది, కనీసము అర గంట కాలమైనా చేయాలి - 
పిదప, చదునైన నేల మీద, దళసరి ఉండేలా ఒక బట్ట పరుచుకొని, దాని మధ్య కూర్చోవాలి, అదీ నడుము, మెడ, తల నిటారుగా చేసుకొని -
పిమ్మట, నిశ్చంతగా, నిశ్చలముగా ఉండే ప్రయత్నము నెమ్మది, నెమ్మది, నెమ్మదిగా పాటించాలి -
ఇక, తనలో, తన ప్రమేయము లేకుండా, ఆడే ఆ గాలి, దాని ఎగువ దిగువ కదలికలును, సున్నితముగా పసి కడుతూ, గుర్తిస్తూ,  సరి చేస్తూ, వాటిని సమము చేసే ప్రయత్నము చేపట్టాలి. 
అలా, ఆ రెండు కదలికలు, కురచై, సూక్ష్మమై,  తుల్యమై సాగితే,
క్రియా యోగ సాధ్యమైనట్టే, సాధించేనట్టే.
అంతే,
అటు పిమ్మట, 
అంతటా, అన్నింటా, శుభమే శుభమ్.
ఇక్కడ, ఒక్క మాట -
పై పద్ధతి, పట్టు పట్టగా,
దానికి, ఒక జోడింపు సమ కూర్చాలి -
పై సాధనలో -
ఆడే ఆ నిశ్చల గాలికి, మనన శబ్దము ఒకటి తోడుగా జోడిస్తే -
ఫలితము, మరింత వేగవంతము, సఫలము - అవుతోంది.
ఆ తోడు -
ఆ శబ్దము -
తరతరాలుగా వస్తోందే, విని పిస్తోందే -
అదే, ఆ శబ్దము -
హిందువుల, 'ఓం', లేదా, ముస్లిముల, 'అమీన్', లేదా, క్రైస్తవుల, 'ఆమెన్', లేదా, అట్టివి - 
ఇది సమ్యక్ స్మరణ -
ఇట్టి శబ్దము అర్ధము -
నిశ్చయమైన విశ్వాసము.
చివరాఖరుగా -
విశ్వాసము ఒక వికాసము 
అవుతోంది, ఐ తీరుతోంది.
***



స్నేహాంజలి...

నా 25వ eBook
కబురులు
చదవండి.
తిరిగి వ్రాయండి
రూ.1,116/-లు
బహుమతిగా పొందండి.
ఆ వివరములు కై  ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.


***