______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

ఆజ్ఞ, కుట్టదు (కురచ కథ)


పూజ ఘనముగా కొనసాగుతోంది.
ఆ పూజ సవ్యముగా జరిగిపోతే, ఆమె మిన్న స్థితికి పోతే, ఆ మీదట తన ఉనికికే ముప్పు వాటిల్లుతోంది అని భావిస్తూన్న అతను, త్వరత్వరగా తెములుతూ కదులుతున్నాడు.
ఆ క్రమములో, ఆ పూజ నాశనముకు అనువు ఐన పథకము అల్లి, దానిని గుట్టుగా, చక్కగా అమలులో పెట్టాడు అతను.
అది పారింది. పూజ చెడింది.
ఆ పూజ నిర్వహిస్తున్న పెద్ద, ఆగ్రహముతో, "మంత్రము వేస్తాను. పూజ చెడ కొట్టిన వారు దురదలు పట్టి, విష పొగకు తాళలేని కన్నములోని పురుగులా బయటపడి తీరుతారు" అన్నాడు అరిచినట్టు. ఆ వెంటనే ఏదో మంత్రము మననము చేశాడు.
అంతే, ఒక మెరుపులా ప్రత్యక్షమై, ఘోరమైన దురదతో నేలన పడి పొర్లి పొర్లి పొర్లుతున్నాడు  పై  దేవుడు, అక్కడ.
కానీ, ఆ పూజ చెడకొట్టిన ఆ అసలు అతను, నిశ్చలముగానే నిలుచుని ఉన్నాడు, అక్కడనే. 
***