______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

ఇంకా వేచి ఉన్నాను (ముచ్చటలు)స్నేహాంజలి.
నా 'కబురులు' (eBook) ను చదివిన, చదువుతూన్న వారందరికీ ధన్యవాదములు.
నేను అనుకోలేదు, నా 'కబురులు' ఇంత ఆదరణ పొందుతాయని. నిజముగా నేను చాలా ఆనంద పడ్డాను, ఫోన్ కాల్ లు, మైయిల్ లు ద్వారా చేరిన వివిధ రీతులులోని  స్పందనలుతో. పైగా ఆ అన్ని స్పందనలు మంచివిగా కావడముతో, మరింత ఆనంద పడుతున్నాను. ఆ అందరికీ మరో మారు, ఇలా, నా ధన్యవాదములు అర్పిస్తున్నాను.
మరో మాట, తొలుత, ఈ నా 'కబురులు' మీద, తిరిగి వ్రాయండి, అని ఒక ప్రక్రియ చేశాను. ఉడతా భక్తిలాంటి బహుమతులు కూడా ప్రకటించాను. అందుకు, ఆశించిన దాని కంటే, మీరి, చాలా రచనలు వచ్చాయి. కానీ, అలా వచ్చిన అవి మాత్రము, నా అంచనాకు తుల్యము కాలేదు. నేను వ్రాసినట్టే, అలానే తిరిగి వ్రాసిన రచనలే రాశిలా అందాయి, ఓ నాలుగు మినహా. ఇక అవిన్నూ, తారుమారుగా, నా వ్రాతలును అటు ఇటుగా, చేసి, వ్రాసి, పంపబడ్డవే. అలా వచ్చిన ఏ వాటిలోనూ, వాటిని వ్రాసిన వారి స్పందన, విశ్లేషణ, అభిప్రాయములు లాంటివి, నేను ఆశించిన మేరకే కాదు కాదా, రవ్వంత ఐనా కానరాలేదు. 
ఆ మొదటి ప్రయత్నము నిరాశ పరిచినా, మరో యత్నము కూడా చేశాను, ఐనా, ఆ మారూ, సరిగ్గా అదే తంతు. అంచేతనే, ఆ ప్రక్రియను రద్దు చేయడము జరిగింది. నిరుత్సాహ పడ్డాను. ఢీలా పడ్డాను. పిమ్మట, చాలా ప్రయత్నముతో కుదుట పడ్డాను, తేలిక పడ్డాను.
ఆ నా 'కబురులు' (eBook) డవున్ లోడ్ లు చాలా అయ్యాయి, ఇప్పటికీ అవుతున్నాయి. వాటిని చదివిన వాళ్ళలో చాలా మంది, నాకు ఫోన్ లు ద్వారా, మెయిల్ లు ద్వారా తమ తమ స్పందనలు, అభిప్రాయములు తెలియ చేశారు, చేస్తున్నారు. వారితో అప్పుడు, అలా ముచ్చటిస్తూనే, మీ స్పందనలు, మీ అభిప్రాయములుతో పాటు, మీ విశ్లేషణలు చేర్చి, తిరిగి వ్రాసి, పంపండి, అవి మిన్న, అవసరము ఐతే, మీ పేరునే, వాటిని   ప్రచురణకు తీసుకు వెళ్తాను, అని కూడా చెప్పాను, చెప్పుతున్నాను. నా అంచనాకు తగ్గవి ఏవీ రాలేదు, రావడము లేదు.
ఐనా, నా ఆశ మేరకు, విశ్లేషణ, అభిప్రాయము, స్పందనలుతో వ్రాసినవి ఇంకా రావచ్చును, అని తలుస్తున్నాను, ఏమరుపాటుతో వాటికై ఎదురు చూస్తున్నాను.
ఇంకా, ఇప్పటికీ, అలా వేచి ఉండడము కూడా, ఒక మంచి లక్షణమే, లక్ష్యమే ... 
కాదా?నా 'కబురులు' (eBook) ఇక్కడ క్లిక్/టచ్ చేసి, ఉచితముగా పొందవచ్చు.


నా 'కబురులు' (eBook) పై తిరిగి వ్రాయండి 
రచన చేయుటకై 
కావాలసిన వివరణకై
ఇక్కడ క్లిక్/టచ్ చేయండి.
అచ్చట తేదీలు మినహా మిగతావన్నీ 
పట్టించుకోవచ్చు/పట్టించుకోవాలి కూడా.


***