______________________________________________________________________________________________________________________

***

నాకై నేను (క్లిక్/టచ్ తో చూడండి)

***

మొత్తం టపాలు : 799

నా అందుబాటులు : prao.bvd@gmail.com / praobvd@yahoo.com

____________________________________________________________________________________________________________________________________

ఈ క్రింది వాటిని క్లిక్ / టచ్ తో ఎంపిక చేసుకొని చూడండి...
నా మొత్తము రచనలు, ఇంతవరకు ...

నా మొత్తము రచనలు, ఇంతవరకు...

[ కథలు:111-కురచ కథలు:105-సూక్ష్మ కథలు:100-బుడుత కథలు:17-
కబురులు:106-మాటలు:25-ముచ్చటలు:220-వచనములు:6-గీతములు:5-మ్'లు:25-హైకూలు:48-అలలు:21-
విశేష రచనలు:9-వెబ్ సీరీస్ స్టోరీలు:1]

వెలువడిన నా పుస్తకములు, ఇంతవరకు...

eBooks : 84
నా తాజా టపా

మనసారా మనవి (ముచ్చటలు)

స్నేహాంజలి.


రచన చేయడము నాకు ప్రీతి. 
పైగా  ఎవరినీ నొప్పించేలా, ఎవరూ నొచ్చుకొనేలా, ఎవరికీ ఏ విధముగా హానికలిగించేలా కాకుండా - ఆ రచన వ్రాయడము నా ముఖ్య కర్తవ్యము అని కూడా భావిస్తుంటాను. 
తొలుత, పత్రికలుకు వ్రాసేవాడిని. ఆ నా రచనలు ఎంతో మంది పాఠకులు ఆదరణ, ఎన్నో పత్రికలు అభిమానము పొందాయి. ఆ పిమ్మట, నా బ్లాగ్ - బివిడి ప్రసాదరావు - మొదలు పెట్టి, అందులో నా రచనలు టపాలుగా పెట్టేవాడిని. ఎంతో మంది నెట్ పాఠకులుకు ఆ నా రచనలు మిక్కిలి చేరువ ఐయ్యాయి.  ఆ తర్వాత, నా రచనలును కినిగె.కాం, డైలీహంట్.కాం, పుస్తకం.ఆర్గ్ ల్లో eBooks గా ప్రచురించాను. ఆ నా రచనలు మంచి సేల్స్  చవిచూశాయి.  ఆ వెంబడి కహానియా.కాం, ప్రతిలిపి.కాం, ఆఫ్ ప్రింట్.ఇన్ ల్లో విడివిడిగా నా రచనలు ప్రచురిస్తున్నాను. ఎప్పటికప్పుడు ఎంతెంతో మంది కొత్త కొత్త పాఠకులు, మిత్రులు ఆ నా రచనలుకు చేరువ అవుతున్నారు. ఇదంతా, నా రచనలు ఎంతో మందికి చేరువ కావాలనే నా తపన మూలముగానే జరుగుతోంది.  అందుకే నా ఈ ప్రయత్నములు అన్నీ ఇలా కొనసాగిస్తున్నాను.
సరే, పాతవే తిరిగి తిరిగి ప్రచురిస్తున్నారు అని కొద్ది మంది అంటున్నా,  ఎప్పటికప్పుడు చాలా మంది కొత్త పాఠకులు వాటిని చదువు తున్నారని నాకు ఎఱిక అవుతూనే ఉంది,  అలాగని, కొత్తవి వ్రాయడము లేదని కాదు, కురచ కథలు, సూక్ష్మ కథలు, బుడుత కథలు ల్లాంటి రచనా ప్రయోగములుతో ఎన్నెన్నో కొత్తవి కూడా మీకు అందిస్తూనే ఉన్నాను. 
ఇక, నా రచన, మీకు నచ్చితే అభినందనతో స్పందిస్తున్నారు. సంతోషము. అలాగే, నచ్చక పోతే, అర్థము కాలేదు అని తెల్పుతున్నారు, అదీ సంతోషమే. కానీ, కొద్ది మంది, నా రచనలు గూర్చి, మీ రచన మూలముగా నా కాలము దండగ ఐనది, ఈ రచన చదవకండి, ఈ రచయితకు ఇట్టి సన్మానము చేయాలి ల్లాంటి తమ స్పందనలు  పెడుతున్నారు. వీరికి, నా సమాధానము, నా రచన మీకు ఎట్టి నష్టము కలిగించిందో పూర్తి వివరణ ఇవ్వండి. అది మీ వ్యక్తిగతము ఐనది ఐనా, మిగతావారు, మీ స్పందన చూసి, నా రచన కాలమును వృథా పరుస్తోందో, నా రచన చదవవచ్చో, కూడదో, నా రచనతో నాకు అట్టి సన్మానము చేయాలో, వద్దో తేల్చుకుంటారు. ఆ పై, మీ వివరణ పై, ఆ నా రచన పై వారు స్పందిస్తారు. అంతే కానీ,  నా రచన మీకు అర్ధము కాకో, నా రచన మీ అభిరుచి మేరకు లేకో, ఐతే, అదే సవివరముగా ఎత్తి చూపండి, తెప్పండి. అది ఉపయోగకరముగా, అమోదయోగ్యముగా ఉంటుంది. 
నా రచన, వ్యక్తిగతముగా కానీ,  సంఘపరముగా కానీ, హాని కలిగించేదిగా ఉంటే, తప్పక ఆయా అంశములు కూడా ఎత్తి చూపి, నన్ను నిలువునా నిలదీయండి. అంతే కానీ, ఏ రచనను దయచేసి కించపర్చవద్దు. ఏ రచయిత  బాధ్యత లేకుండా తన రచన కొనసాగించడు, కొనసాగించలేడు.
నచ్చితే ఎందుకు నచ్చిందో చెప్పకపోయినా, నచ్చక పోతే మాత్రము ఎందుకు నచ్చడము లేదో వివరముగా చెప్పడము మాత్రము ప్రతి పాఠకుడు బాధ్యత.
రచయిత లేనిదే రచన లేదు, పాఠకుడు లేనిదే ఆ రచనకు మనుగడ లేదు. ఇదే నేను నిత్యం నమ్మిన సత్యం.
మీ,
బివిడి ప్రసాదరావు.

***