నా యుట్యూబ్ ఛానల్ కై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా ఇ-బుక్కులకై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా రచన లగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)


నా సోషల్ మీడియా లింక్సు (క్లిక్/టచ్ చేయండి)


   

నా బ్లాగు నగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)

    

నేటి నా బ్లాగు టపా :: టపా సంఖ్య : 1310

మనసు మనిషి (కథ)


తన సహ ఉద్యోగి శ్రీధర్ నుండి ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు సహదేవ్ సాయంకాలం ఆఫీస్ వద్ద.
ఆ నెంబర్ కి కాల్ చేశాడు రాత్రి తొమ్మిది అప్పుడు.
ఆమె కాల్ లోకి వచ్చింది. "హలో" అంది.
శ్రీధర్ చెప్పాడు. తొలుత ఆమెకు ఫోన్ చేయమని, ఆమె రమ్మంటేనే వెళ్లమని.
"రావచ్చా" అడిగేశాడు సహదేవ్.
"గంట తర్వాత" చెప్పింది ఆమె.
"సరే. ఆ తర్వాతే వస్తాను" చెప్పాడు సహదేవ్.
ఆమె 'సరే' అంది.
సహదేవ్ ముప్పావు గంట తర్వాత ఇంటి నుండి బయటకి వచ్చాడు. 
ఇంటి ముందు తలుపుకి తాళం వేశాడు.
చలి కాలం. 
సహదేవ్ రెండు అర చేతుల్ని కలిపి గట్టిగా రుద్దుకున్నాడు. ఆత్రంగా  తన స్కూటర్ ని స్టార్ట్ చేశాడు. 
సహదేవ్ కి పెళ్లయ్యి అర్థ సంవత్సరం కావస్తుంది. తన భార్య పుట్టింటికి వెళ్లి ఉంది. రుచి ఎరిగిన అతడి మనసు స్త్రీ పొందుకై తెగ బేజారవ్వుతుంది.
బజారు తొంభై తొమ్మిది శాతం ఖాళయ్యింది. 
అర గంట పిమ్మట సహదేవ్ తన స్కూటర్ ని ఓ టీ కొట్టు ముందు ఆపాడు. ఆ కొట్టు మూసేసి ఉంది.
సహదేవ్ తన స్కూటర్ ని ఆ టీ కొట్టుకు ఓ ఓరన పెట్టాడు. దాని కీ తీశాడు. దాన్ని జేబులో పడేసుకున్నాడు. 
ఫోన్ లో టైం చూసుకున్నాడు. 
కొద్ది నిముషాలు గడిచాక ముందుకు కదులుతున్నాడు.
సహదేవ్ అటు ఇటు చూడక శ్రీధర్ చెప్పిన ప్రకారం నేరుగా ఆ సందులోకి పోయాడు. 
ఆమెకు ఫోన్ చేశాడు.
"ఆఁ. చెప్పండి" అటు ఆమె అడిగింది.
"సందులో ఉన్నాను. లైట్ పోల్ దరిన ఉన్న గ్రీన్ కలర్ సున్నం వేసిన ఇల్లు కదా" అనడిగాడు సహదేవ్, శ్రీధర్ చెప్పిన గుర్తుల్ని నెమరవేసుకుంటూ.
"ఆఁ. అవునవును. నేను ఇంటి బయటికి వస్తున్నా." అని ఆమె ఫోన్ ని టేబుల్ మీద పెట్టింది. కదిలి తన ఇంటి ముందున నిల్చుంది.
ఆ కాల్ ని కట్ చేసేశాడు సహదేవ్. ముందుకు నడుస్తున్నాడు.
ఆ ఇంటి ముందు ఒకామె కనిపించింది అతడికి. నేరుగా అటు వెళ్లాడు.
ఆమె లోనికి రమ్మనమంది. ఆ వెంటనే అటు కదిలింది.
ఆమె వెనుకే సహదేవ్ ఆ ఇంటిలోకి నడిచాడు.
ఆమె ఆ ఇంటి వీధి తలుపుని మూసేసింది. కదిలింది.
ఆమె ఓ గదిలోకి వెళ్లింది. వెనుకే సహదేవ్ వెళ్లాడు.
సహదేవ్ ఆమెనే చూస్తున్నాడు. ఆమె వయసున ఉంది.
సహదేవ్ ఆమె ఒంటి బిగికి దాసోహమైపోతున్నాడు. శ్రీధర్ వర్ణించినట్టే ఆమె ఉందనుకున్నాడు. 
"కూర్చోండి" అంటూ మంచం పక్కనే ఉన్న స్టూల్ ని చూపింది ఆమె.
సహదేవ్ కూర్చున్నాడు. 
నుదుటి చెమటని రుమాలుతో తుడుచుకుంటున్నాడు సహదేవ్.
"చలిలోనూ చెమటే" అందామె చిన్నగా నవ్వుతూ.
"కొత్త. గాభరా. అంతే" చెప్పాడు సహదేవ్ చుట్టూ చూస్తూ.
గది నీట్ గా ఉంది.
"రాత్రంతా ఉంటారా" అడిగింది ఆమె.
"ఏం" అన్నాడు సహదేవ్.
"అదే తెల్లవారి వరకైతే..." అని చెప్పుతూన్న ఆమెకు అడ్డై -
"నాకు తెలుసు." అనని, శ్రీధర్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటూ, "గంట ఉంటా. రెండు వందలు ఇవిగో" అనంటూ రెండు వంద నోట్లును ఆమెకి అందించాడు సహదేవ్.
ఆమె ఆ నోట్లును పుచ్చుకొని వెళ్లి వాటిని ఆ గది తూర్పు గోడ బీరువాలో పెట్టింది. 
తిరిగి సహదేవ్ వైపు వచ్చింది. 
"ఇప్పుడే వస్తాను" అంటూ ఆ గది బయటికి వచ్చి బాత్రూంకి వెళ్లింది. 
తిరిగి గదిలోకి వచ్చి ఆ గది తలుపు మూసి లోపలి గడియ పెట్టింది.
సహదేవ్ ఆమెతో మంచం మీదికి చేరాడు.
కాలం గడుస్తుంది.
సహదేవ్ ఆత్రమవుతున్నాడు.
అంత వరకు సహకరిస్తున్న ఆమె సడన్ గా డీలా అయిపోతుంది.
సహదేవ్ అది పట్టించుకోవడం లేదు. తన సొదలో తాను ఉన్నాడు.
గంట ముగియలేదు.
సహదేవ్ ఆత్రం తీరలేదు.
ఆమె అతడిని నెట్టేసింది.
పట్టు తప్పి ఆమె పై నుండి కింద పడ్డ సహదేవ్ టక్కున బెంబేలయ్యాడు. కారణం ఆమె ఒక్కమారుగా బిగ్గరగా మూలగడంతో.
ఆమెని చూస్తూనే లేచి నించున్నాడు సహదేవ్.
ఆమె అవస్థ పడుతుంది. ఆయాస పడుతుంది. 
తన రెండు అర చేతులతో తన ఛాతీ ఎడమ వైపుని అదుముకుంటుంది.
చాలా గింజుకుంటుంది. 
ఇంతటినీ చూస్తూనే సహదేవ్ గబగబా బట్టలు వేసుకున్నాడు. 
ఆమె చెంతని చేరాడు.
ఆమెకి ఊపిరాడడం లేదని పోల్చుకున్నాడు. 
సహదేవ్ ఆందోళనవుతున్నాడు. 
ఐనా కింద పడ్డ ఆమె బట్టలని అందుకున్నాడు. ఆమెను కప్పేస్తున్నట్టు ఆ బట్టలను ఆమె మీద సర్దాడు.
ఆమె ఏదో చెప్పబోతుంది. 
సహదేవ్ ఆమెను పట్టించుకోక ఆమె ఫోన్ కై చూశాడు. అది టేబుల్ అంచున కనిపించింది. దాన్ని తీసుకున్నాడు. 
108 కి డైల్ చేశాడు. ఆడ గొంతులా తన గొంతుని మార్చి, "గుండె పోటు. ఒక్కదాన్నే. త్వరగా రండి" అని చెప్పి, తను గుర్తు ఎరిగిన ఆ ఇంటి వివరాలని చెప్పాడు. ఆ వెంటనే ఆ ఫోన్ లోని తన ఫోన్ కాల్ వివరాలన్నింటినీ చకచకా డిలీట్ చేసేశాడు. ఆ ఫోన్ ని ఆ మంచం మీద పడేశాడు.
ఆమె సహదేవ్ వైపు దీనంగా చూస్తుంది.
సహదేవ్ మాత్రం నేరుగా ఆ గది తూర్పు గోడ బీరువా వైపు కదిలాడు. అక్కడి నోట్లల్లోంచి రెండు వంద నోట్లును తీసుకున్నాడు. వాటిని తన జేబులోకి కుక్కున్నాడు.    వెను వెంటనే ఆ గది తలుపుని ఆ ఇంటి వీధి తలుపుని బార్లా తెరిచేసి బయటకి వచ్చేశాడు.
వెనుకకు చూడక ముందుకు చొచ్చుకుపోతున్నట్టు నడిచాడు సహదేవ్. తన స్కూటర్ ని చేరాడు. నక్కినట్టు నిల్చున్నాడు.   
కొన్ని నిముషాలు తర్వాత అటు 108 వచ్చింది. ఆ సందులోకి పోయింది.
అదరాబాదరాగా తన స్కూటర్ ని స్టార్ట్ చేశాడు సహదేవ్. తన ఇంటి వైపు కదిలాడు.
***
(ప్రచురణ : ప్రతిలిపి వెబ్ పత్రిక - 20.1.2021)
***

ఈ నా బ్లాగ్ పై మీ స్పందన ...

పేరు

ఇమెయిల్ *

సందేశం *

ధన్యవాదములు ... నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం