నా ఇ-బుక్కులకై క్రింద క్లిక్/టచ్ చేయండి

నా రచన లగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)

నా సోషల్ మీడియా లింక్స్ (క్లిక్/టచ్ చేయండి)

   

నా బ్లాగు నగుపర్చు సైట్లు (వీటిపై క్లిక్/టచ్ చేయండి)

    

నేటి నా బ్లాగు టపా :: టపా సంఖ్య : 1161

పిచ్చుక - మార్చి 20 - నడుమ కథ



స్నేహాంజలి.

నా తెలుగు వ్రాతలు ను

ఆడియో మరియు వీడియో

రూపాల్లో

అందించే

నా

యూట్యూబ్ ఛానల్

తెలుగు శబ్దాలు

లో

కొత్త వీడియో 

కై

పై చిత్రం పై

క్లిక్ / టచ్ చేయండి ...

వీక్షించండి ...

దయచేసి ఈ నా ఛానల్ కి

సబ్ ష్క్రైబ్ అవ్వండి ...


మీ

బివిడి ప్రసాదరావు

నా కబురులు



శ్రీ రమణ మహర్షి

రమణ మహర్షి  ఒక భారతీయ బుుషి.
వీరు 30-12-1879 – 14-4-1950 మధ్య కాలం నాటి వారు.  
రమణ మహర్షి అసలు పేరు వేంకటేశ్వరన్ అయ్యర్. భారతదేశం, తమిళనాడు లోని మధురై జిల్లా,   తిరుచ్చుళిలో 30-12-1879న తెల్లవారు జామున  ఒంటి గంటకు  పునర్వసు నక్షత్ర గమన సమయాన్న  వీరు జన్మించారు. వీరి తల్లి శ్రీమతి అళగమ్మాళ్, వీరి తండ్రి శ్రీ సుందరేశం అయ్యర్లు. వీరి సోదరులు నాగస్వామి, నాగ సుందరం, సోదరి అలమేలు.
రమణ మహర్షి తొలుత అందరు పిల్లల్లా సాధారణంగా ఉండేవారు. సరైన దేహ దారుఢ్యం కలిగి ఉండేవారు. వీరు చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు. ఎప్పుడు పరధ్యానంగా ఉండేవారు. ఎంతటి పరధ్యానం అంటే వీరు ఆ స్ధితిన ఉన్నప్పుడు తోటి పిల్లలు వీరిని కుదిపినా, బాదినా వీరికి తెలిసేది కాదు. 
రమణ మహర్షి ఒక మారు పాఠశాలలో తన పేరుని రాయమంటే వీరు వేంకటేశ్వరన్ బదులు వెంకట్రామన్ అని రాయడం జరిగింది. అప్పటి నుండి వీరిని వెంకట్రామన్ అని పిలవడం మొదలు అయింది. 

అరుణాచలం

రమణ మహర్షి జీవిత గమనంలో మరో విశేషం, తరుచూ అరుణాచలం వెళ్లి వస్తుండే  రామస్వామి అయ్యర్ అనే ఆయన్ని వీరు ఒక మారు పలకరించి, 'ఎక్కడ నుంచి వస్తున్నారు' అని అడిగారు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నానని, అరుణాచలం అనగా అ-రుణ అంటే పాపాలను హరించునది అని, అచలం అంటే కొండ అని, అరుణాచలం క్షేత్ర దేవతా మూర్తి అరుణాచలేశ్వరుడు అని, ఈయన దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడింది అని, ఇచ్చట అరుణాచలేశ్వరుడు తేజోలింగం రూపంలో స్థిర పడడంతో దీనిని అగ్ని క్షేత్రం అంటారు అని చెప్పగా, ఆయన నోట 'అరుణాచలం' మాట విన్న తరువాత వీరిలో గొప్ప అనుభూతి రగిలింది. అది మొదలు వీరిలో పరధ్యానం మరింత ఎక్కువయ్యింది. అరుణాచలం అనేది సాధారణమైన వారికి ఒక కొండ. కానీ కరుణాసముద్రుడైన శివుడే ఘనీభవించి ఈ కొండయై నిలిచాడని వీరి అనుభూతి. 
రమణ మహర్షి తన 16 సంవత్సరాల వయస్సులో మోక్ష జ్ఞానం పొంది, 1-9-1896  తేదీన తిరువణ్ణామలై లోని అరుణాచలం పయినమయ్యారు. అచ్చట అరుణాచలేశ్వరాలయంలో ఆ క్షేత్ర మూర్తికి తనను తాను సమర్పణం చేసుకుని, పిమ్మట సమీపంలోని ఒక అనుకూల పర్వతంపై స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. అక్కడి విరూపాక్ష కొండ గుహలో మౌన ముద్రలో ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే కావ్యకంఠ గణపతి ముని వీరిని దర్శించుకుని, తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, వీరికి 'రమణ మహర్షి'గా నామకరణం చేశారు.

చిన్న కథ


కిరాయి దొరికింది.
ఆటో స్టార్ట్ చేశాను.
ఒకరే. డైరక్టుగా తీసుకు వెళ్లడానికి మాట్లాడారు.
బేరాలు తర్వాత ఒప్పుకున్నారు ఆయన.
నిజానికి కిరాయి మొత్తం ఎక్కువే.
బాబుకు బొమ్మ కొని పెట్టవచ్చు. పాపకు క్లాస్ నోట్ బుక్కు కొని ఇవ్వవచ్చు. పెళ్లాంకు మల్లెమాల కొని పెట్టవచ్చు. ఇంటికి రాత్రికి బిరియానీ పట్టుకుపోవచ్చు.
ఇలా సాగుతున్న నా ఆలోచనలకు స్పీడ్ బ్రేకర్ లా ఒక్కమారుగా పెద్ద చప్పుడు వినిపించింది.
ఆకాశం గుండా ఉరుము చప్పుడు అది.
అప్పటికే ఎప్పుడో మేఘాలు కమ్మి, ఆకాశం అస్సలు కానరావడం లేదు.
చినుకులు మొదలయ్యాయి. వాన వచ్చేలా ఉంది. వర్షంలా నిలిచేలా ఉంది.
గాలి జోరు పెరుగుతోంది.
మెరుపులు వడివడిగా కనిపిస్తున్నాయి.
ఉండి ఉండి ఉరుము చప్పుళ్లు వినిపిస్తున్నాయి.
రోడ్డున రద్దీ పల్చబడుతోంది.
గాలికి చినుకులు విచ్చలవిడిగా చెల్లా చెదురవుతున్నాయి.
"సైడ్ క్లాత్లు లేవా" ఆటోలో ఆయన అడిగారు.
"వర్షాకాలం కాదు సార్. వేసవి వర్షాలు అంతంత. అందుకే ఇంట్లో పెట్టేశాను" చెప్పాను నేను.
వాన మొదలయ్యింది.
ఆ జంక్షన్ దాటిపోయాం.
ఈ రోడ్డు వైపు పోతున్నాం.
రోడ్డు కుదుపులను జాస్తీగానే ఇస్తోంది.
ఆటోను తగు వేగంతోనే నడుపుతున్నాను.
ఎవడో, కుర్రోడు, రోడ్డు మధ్యకు టక్కున వచ్చేసి, ఆటోను ఆపమన్నట్టు చేయి తెగ ఊపేస్తున్నాడు.
ఆ కుర్రోడు, ఒక స్టూడెంట్ లా ఉన్నాడు.
"పాపం తడుస్తున్నాడు సార్. ఎక్కించుకుందాం సార్" అన్నాను నేను, ఆటోలో ఆయనతో.
ఆయన ఏమీ మాట్లాడలేదు.

నా కబురులు


డ్రాగన్ ఫ్రూట్
విదేశాలలో సాగై లభించే అసమానమైన డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో మన ఇండియాలో కూడా లభిస్తుంది. పైగా  తెలంగాణ రాష్ట్రంలో వీటి సాగుకు కృషి ముమ్మరంగా ఉంది. అందుకు కారణం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు తెలంగాణ ప్రాంత వాతావరణం, భూమి అనుకూలత అనుకూలంగా ఉండడమే. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో  కూడా  డ్రాగన్ ఫ్రూట్‌  సాగుకు కృషి జరుగుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ దక్షిణ అమెరికాలో పుట్టింది. తొలుత దీనిని అమెరికన్ బ్యూటీ అనే వారు. అయితే ఈ పంట సాగు చైనాలో విరివిగా మొదలైన రోజుల్లో ఇది వారి పవిత్రమైన జంతువు  డ్రాగన్ ఆకృతి పోలి ఉందని వారు దీనిని డ్రాగన్ ఫ్రూట్ గా  పిలవడం జరిగింది. ఆ తర్వాత అదే పేరు వాడుకలో స్ధిర పడిపోయింది.
డ్రాగన్ ఫ్రూట్ గులాబీ రంగులో చిత్రమైన ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ ఉన్న రేకులు పసుపు ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ఈ పండులోని గుజ్జు తెలుపు రంగులో చిన్నపాటి గట్టితనంతో ఉంటుంది. ఈ గుజ్జు మధ్యలో నల్లని చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఈ పండును ఈ గింజలతో సహా తినవచ్చు. ఈ పండు రుచి కాస్త పుల్లన, కాస్త తీపి మిళితమై ఉంటుంది.

నా కబురులు


     రామాయణం ఫలములు
నా కొడుకు కూతురు పిల్లలతో కల్సి ఫ్రూట్స్ షాపుకి వెళ్లాను.
అక్కడ సీతాఫలాల్ని చూసిన నా కొడుకు కొడుకు - తాతా ఇవేటి - అని అడిగాడు. వాడు నర్సరీ స్టాండర్డ్ చదువుతున్నాడు.
నేను చెప్పబోతుండగా నా కూతురు కొడుకు -  పల్లు - అని అన్నాడు. వాడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు.
ఏటీ - నా కొడుకు కొడుకు అన్నాడు.
ఫ్రూట్స్ - అని చెప్పింది నా కూతురు కూతురు. తను సెకెండ్ స్టాండర్డ్ చదువుతుంది.
వాళ్ల సంభాషణకి కత్తెర పడేలా నేను చెప్పాను - ఇవి సీతాఫలాలు - అని.
పలాలా - అంది నా కొడుకు కూతురు. తను ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది.
ఫ్రూట్స్ - అని చెప్పింది నా కూతురు కూతురు తిరిగి.
వాటిని కొని పెట్టాలని వాళ్లని అటు తోడ్చుకొని వెళ్లాను.
సీతాపలాలు అంటే సీత ప్రూట్సా - టక్కున అడిగాడు నా కూతురు కొడుకు. వాడిలో శోధన ఎక్కువ. ప్రతి దానికీ ప్రశ్నలు అల్లుకుపోతాడు.
అక్కడ సీతాఫలాల బుట్టల ప్రక్కనే రామాఫలాల బుట్ట ఒకటి ఉంది. దానిని చూసిన నా కొడుకు కూతురు - తాతా ఇవేటి. రెడ్గా ఉన్నాయి - అని అంది.


నా కబురులు


మా మంచి పొదుపు

          పొదుపు అంటే దాచుకోవడం. దాచుకోవడం హేతువు ముందు చూపు. ఈ ముందు చూపు దేనికి? భవిష్యత్తు సాఫీగా కొనసాగుటకు. ప్రస్తుత ఆదాయావకాశాలు పోను పోను సన్నగిలవచ్చు లేదా అందకపోవచ్చు. అట్టి సమయాన ప్రస్తుత స్థితే సక్రమంగా కొనసాగుటకు తక్షణం చేపట్టవలసిన తప్పనిసరి పని పొదుపు.
          వచ్చే ఆదాయవనరులోనించి వినియోగం పోగా మిగిలిందే పొదుపు. ఈ పొదుపు పొందికకు అతి ముఖ్య నియమం ఖర్చులను తగ్గించుకోవడం. అంచేత అదాయ వినియోగంలో అతిని తరిమికొట్టాలి. మితంని ఆశ్రయించాలి.
          ఖర్చు తగ్గించడంతో పొదుపు చేయడం కాదు. ఖర్చులు పోగా ఆ మిగిలిన ఆదాయం కాస్తైనా వృద్ధయ్యేలా ప్రణాళిక చేసుకోవాలి. అదే పొదుపుకు నిజమైన అర్థం. మరో మారు  చెప్పతగ్గది - ఖర్చు పోగా మిగిలింది అలా దాయడం ప్రయోజనం కాదు. పొదుపు పెట్టుబడితో వృద్ధి పరచాలి. అలాగే ఇది స్వార్థ రీతిన కాక సరళ తీరున జరగేలా జాగృతి కావాలి. లేదంటే చేపట్టిన ఈ పొదుపు వృద్ధి ప్రక్రియ కూర్చున్న కొమ్మనే తనకు తానే నరుక్కున్నట్టు అవుతుంది. అంతే కాదు ఈ పొదుపు ప్రక్రియ సర్వ ఆర్థిక వ్యవస్థనే కదిలించేస్తుంది.   
          మిగులు ఆదాయ వనరు స్థిరంగా చిక్కాలంటే అవసర ఖర్చులతో పాటుగా అప్పులు జోలికి పోరాదు. అప్పు చాలా ముప్పు. ఇది చాలా తిప్పలకి గురిచేయడమే కాదు గింగిరులు పెట్టిస్తుంది. సునామీ తీరున ఏదో ఒక నాడు కుదేలు చేస్తుంది. కనుకనే పొదుపు ప్రక్రియకు అతి ఆటంకి ఈ అప్పు. కనుక దీని జోలికి పోరాదు. ఐనా మరో మాట -  తలవని తలంపుగా అత్యవసర ఖర్చు తారసపడవచ్చు. ఆ సమయాన అప్పు అవసరం తలెత్తవచ్చు. తప్పదు మరి.

నా ముచ్చటలు



గోవర్ధన పూజ


గోవర్ధన పూజ ఇంద్రుడుపై కృష్ణుడు గెలుపొందిన సందర్భంన జరుపుకుంటున్న పండుగ. దీని వెనుక కథ కృష్ణుడు యదుకులంలో ఉండగా ఒకసారి ఇంద్రుడు యాదవులపై కోపంతో కుండపోతగా వర్షం కురిపిస్తాడు. అప్పుడు వారంతా కృష్ణుడును కాపాడమని వేడుకుంటారు. దాంతో కృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలితో గోవర్థన అనే పర్వతాన్ని ఎత్తి వారందరిని దాని క్రిందకి చేరమంటాడు.  వారంతా దాని నీడన తలదాచుకుంటారు తమ ప్రీతికరమైన తమ తమ గోవులతో సహా. ఏడు దినాలపాటు తన పంతంగా కుండపోత వర్షంతో పాటు భయంకరమైన రాళ్ల వర్షాన్ని కూడా కురిపించి కురిపించి చివరికి కృష్ణుడు సామాన్యుడు పిల్లవాడు కాదు భగవంతుడని గ్రహించి తన ఓటమిని అంగీకరిస్తాడు ఇంద్రుడు.
ఈ దినంన ఈ గోవర్థన పర్వతం చుట్టూ చేరగలిగిన వారు చేరి దానిని చుట్చొచ్చేలా ప్రదక్షిణాలతో పాటు గానాలు భజనలు చేస్తూ ఈ పూజను చేస్తారు. కుదరని వారు తమకు అనువైన చోట్లలో భక్తి శ్రద్ధలతో పాటు ఆ విధం తలపించేలా ఈ పూజను నిర్వహిస్తుంటారు.
మథురకు దరిన ఉన్న గోవర్ధన పర్వతం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుట వెనుక కథ - ఈ గోవర్ధన పర్వతం కృష్ణుడు తన దైవ లీలలో ఒక భాగంగా స్వర్గం నుండి భూమి మీదకు రప్పించినదని చెప్పబడుతుంది. అలాగే ఈ గోవర్ధన పర్వతంతో పాటు దీని చుట్టూరా ప్రాంతం కృష్ణుడుకి మిక్కిలి ప్రీతికరమైనదని నమ్ముతారు. అంచేత ఈ గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరి తీరుతాయని ఒక బలమైన విశ్వాసం కూడా ఉంది.


నా ముచ్చటలు



నరక చతుర్ధశి


          ధన త్రయోదశి తర్వాత దినం ఆశ్వయుజ బహుళ చతుర్థశి. ఈ దినంన భూదేవి విష్ణు అవతారమైన వరహస్వామిల బిడ్డ సత్ సంకల్పం సత్ గుణం కలిగిన నరకాసురుడు బాణాసురుడు అనే వానితో స్నేహం చేసి చెడి అతి తీవ్రమైన సంక్షోభాల్ని కలిగిస్తుండగా కృష్ణుడు సహకారం పొందిన సత్యభామచే వధింపబడతాడు. దీనికి ముందు ఒక మారు తన చేతిలోనే తన బిడ్డైన నరకాసురుడు మరణించేలా వరం పొందుతుంది భూదేవి. దాంతో విష్ణు కృష్ణుడుగా  భూదేవి సత్యభామగా అవరించిన కాలంలో నరకాసురుడు లోక కంటకుడై ఉండగా సత్యభామచే వధింపబడ్డాడు. అప్పుడు  భూదేవి అంశ అయిన సత్యభామ తన బిడ్డైన నరకాసురుడు పేరున ఒకటి కలకాలం ఉండేలా చేయమని వేడుకోగా నరకాసురుడు వధింపబడ్డ  ఈ దినంను నరక చతుర్థశిగా పిలువబడుతుందని నిబద్ధతతో ఈ దినం గడుస్తుందని వరం ప్రసాదిస్తాడు కృష్ణుడు. కనుక ఈ దినాన్ని నరక చతుర్థశిగా చెప్పుకుంటారు. అలాగే ఎట్టి అట్టహాసాలు లేకుండా సవ్యంగా అంతా నడుచుకుంటుంటారు.


నా ముచ్చటలు



ధన త్రయోదశి



  (ధన్వంతరి)
   ఆయుర్వేదానికి ఆరాధ్యుడు ధన్వంతరి. ఈ ధన్వంతరి క్షీరసాగర మథనం ఘటనలో మహావిష్ణు అంశావతారంగా సమస్త రోగహరుడుగా ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆవిర్భవించాడు. కనుక అలా జన్మించిన ధన్వంతరి జన్మదినాన్ని ధన్వంతరి త్రయోదశి పేరిట ఒక వేడుకగా జరుపుకోవడం మొదలైంది. ఐనా కాల ప్రభావంలో అది ధన త్రయోదశి ఐంది. ధన త్రయోదశికి ఇది ఒక కథనం.

నా ముచ్చటలు




దసరా సరదా

            హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి.  తొమ్మిది రోజుల దేవీ నవరాత్రుల ఉత్సవాలు మరియు పదవ రోజు విజయ దశమి వేడుక కలసి దసరా పండుగ అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ప్రీతికి కొలిచే పండుగ. కొందరు ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి, తరువాతి మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.  బొమ్మల కొలువు పెట్టడం ఈ పండుగలో ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు.
            దైత్యవంశంలో జన్మించిన మహిషాసురుడు మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేస్తాడు. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై  ఏ వరం కావాలో కోరుకోమంటాడు. తనకు మరణం లేని జీవితం కావాలని కోరుకుంటాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక మరే వరమైనా కోరుకో’ అంటాడు. అప్పుడు మహిషాసురుడు ‘సరే ఐతే. ఆడది నా దృష్టిలో అబల. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించాడు. దాంతో మహిషాసురుడు విర్రవీగి దేవతల్తో  యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి లాక్కుంటాడు. పదవి కోల్పోయిన దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకుంటాడు.  త్రిమూర్తులు యోచించి తమ తేజము కేంద్రీకృతమైన ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు.
            శివుని తేజము ముఖంగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆ స్త్రీమూర్తి  దుర్గ, లక్ష్మి, సరస్వతిల ప్రతీకతో 18 బాహువులు కలిగి ఉంటుంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాలను, హిమవంతుడు సింహమును ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఇచ్చిన వాటిని తన ఆయుధాలుగా మార్చుకొని మహిషాసురుడుతో తలపడి తీవ్ర భీకర పోరు సుదీర్ఘంగా సల్పింది.  చివరకు ఒక దినమున మహిషాసురుడు మహిషి రూపములోని ఆ స్త్రీమూర్తి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి ఆ దినము దసరా పర్వదినముగా ప్రజలచే కొనియాడబడుతుంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజు మొదలు నవమి రోజు వరకు ఈ పండుగ వేడుక నిర్వహింపబడుతుంది. ఈ  రోజులలో - 

నా ముచ్చటలు



(నేటి మందిరంలో సాయి)
షిర్డీ సాయిబాబా
            వీరు ఒక మార్మికుడు.
          వీరి ఊరు పేరు తల్లిదండ్రులు మతం కులం వగైరాలు తెలీయడం లేదు.  కొన్ని అధ్యయనాల వల్ల వీరు 28-9-1835 - 15-10-1918 కాలం నాటి వారిగా తెలియవస్తుంది. వీరు షిర్డీ చుట్టుప్రక్కల ప్రాంతంలో జన్మించి ఉంటారనీ వీరి బాల్య నామం హరిభావు భుసారి అని కూడా తెలియవస్తుంది. ఇక వీరు మాత్రం తన గురించి ఇట్టి వివరాలు ఎన్నడూ స్పష్టంగా చెప్పలేదు. పైగా వాటికై ఎట్టి ప్రాధాన్యం ప్రచారం వద్దనేవారు. ఐనా ఒకమారు మాత్రం తను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు వీరే చెప్పినట్టు  ఒక కథనం ఉంది. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకి చెందిన వెంకోసా అనే గురువుకి అప్పగించినట్లు తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు వీరు స్వయంగా చెప్పినట్టు మరో కథనం కూడా ఉంది.
          ఇక రమారమీ పదహారు సంవత్సరాల ప్రాయంలో వీరు మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిర్డీకి వచ్చినట్టు ఒక వేప చెట్టు క్రింద స్థిర ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవారని వీరిని ధార్మిక చింతనాపరులైన ఆ గ్రామస్థులు  తరచు దర్శించసాగేవారని అలాగే ఇలా అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం వీరు కనుపించలేదని మళ్ళీ ఒక సంవత్సరం తరువాత షిరిడీకి తిరిగి వీరు వచ్చినట్టు అత్యధికులు తెలిపిన విషయం. దీనికి ఆసరా ఐంది ఈ క్రింది వాస్తవం.
          1858 సంవత్సరంలో చాంద్ పాటిల్ కుటుంబంతో కలిసి వీరు షిరిడీ వచ్చారు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర వీరు బండి దిగినప్పుడు ఆ మందిరం పూజారి మహాల్సాపతి కాకతాళీయంగా “ఆవో సాయీ” (రండి సాయీ) అని వీరిని పిలిచారు. అలా ఆ తరువాత 'సాయి' అనే నామం వీరికి స్థిరపడి అటు తర్వాత క్రమేపీగా సాయిబాబాగా అది మారింది. ఐనా వీరికై వీరి ప్రీతి పిలుపు సాయీ.
(తొలుత సాయి)

ధన్యవాదములు ... నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం