హైదరాబాద్, భారతదేశం

స్నేహాంజలి ... నా 48 కబురులు, 113 కథలు, 110 కురచ కథలు, 106 సూక్ష్మ కథలు, 25 బుడుత కథలు, 102 వివిధ రచనలు, 6 వెబ్ సీరీస్ స్టోరీస్, 22 ముచ్చటలు, 85 eBooks మరియు ఇతర అంశములు కై క్రింది విషయ పట్టిక పై క్లిక్ / టచ్ చేయండి ...

నేటి టపా :: టపా సంఖ్య : 917

ఆవులింతఇవి నావే, ఐనా చాలా వరకు ఆలోచన పరమైన మరియు ఆచరణ పరమైన సంగతులు...


ట్రింగ్ ... ట్రింగ్ ... హలో ఫోన్ మీకే ...


ఫోన్ ... సెల్ ఫోన్ ... స్మార్ట్ ఫోన్ ... 
నేటి అత్యంత నిత్యవసరంగా నెత్తిన ఎక్కిన లేదు మనమే నెత్తికి ఎక్కించుకున్న ఒక సాధనం. ఊపిరాటని పరిశీలించం ... ఊపిరాటని పట్టించుకోం. 
కానీ ఈ మొబైల్ సాధనం 
మన చెంతన, మన చేతిన ఉందో లేదో అన్న ధ్యాస మనం విడవలేకపోతున్నాం. వీడలేకపోతున్నాం. 
ఏమి వింత ఇది. ఎంత చోద్యము మరి.

సమాచారం అందించడానికి లేదా అందుకోవడానికి మంచి సాధనంగా అవిష్కరింపబడిన ఈ ఫోన్ ఎంతగా మనల్ని వశపర్చుకుంది, ఒంచేస్తోంది, వంచన చేసేస్తోంది. ఆలోచించామా. తర్జనభర్జన చేశామా. లేదు. ఆ తోవ వదిలి దాని తోవనే పోతున్నాం, కొట్టుకుపోతున్నాం.

సరే కానీ, ఇది మీకు ఒక  సోది లేదా సొద అనిపించవచ్చు. ఐనా కానీ, దీనిపై  కబుర్లాడక తప్పడం లేదు మరి నాకు. ఎందుకంటే ఫోన్ సాధనం తాలూకు  చోద్యాలు ఎన్నో, ఎన్నెన్నో నాకు తెలిసి వచ్చాయి, తారస పడ్డాయి. కావాలంటే ఈ క్రింది వాటిని పఠించండి ఓ మారు.
 • రోజూ ఒకే సమయాన ఫోన్ చేస్తున్నవారు ఉంటారు. వారితో ఇబ్బంది ఉండదు. కారణం అది వారి ఆపేక్ష. ఆ తీరుకు అలవాటైన వారు అట్టి కాల్ కై ఎదురు చూడడం కూడా కద్దు. పైగా ఆ హద్దున ఆ కాల్ రాకపోతే తల్లడిల్లిపోయే అవకాశం కూడా మొండుగా ఉంటుంది కదా.
 • ఒక్కొక్కసారి సడన్ కాల్స్ వస్తుంటాయి. అట్టి కాల్స్ వచ్చిన సమయాన్న పనిలో ఉన్నవారు దానిని ఎత్తరు. పైగా తమలో తామే గొణుక్కుంటారు. తమను తామే కసురుకుంటారు. పైగా ఆ సమయాన్న ఎదుట పడ్డ లేదా ఎదుట ఉన్న వారి పై చిందులు మొదలు పెడతారు. లేదా చేతిలోని పనిని తగలెట్టేస్తుంటారు. తద్వారా తమకు  తామే ఆంటకం ఐపోతుంటారు. కానీ ఆ వచ్చిన కాల్ ని రిసీవ్ చేసుకొని, అది సామాన్యం కాల్ ఐతే, సున్నితంగా తను పనిలో ఉన్నానని ఆ పని తర్వాత తానే తిరిగి కాల్ చేస్తానని చెప్పగలిగితే సరిపోతోంది. పైగా అటు ఇటు వారికి సౌఖ్యంగా, సౌమ్యంగా ఉంటుంది కదా.
 • ఫోన్ చేయ తలచినవారు  సమయం పాటించాలి. అత్యవసరమైన కాల్ ఐతే తప్పదు కానీ మామూలు కాల్ ఐనప్పుడు తప్పక ఆలోచించ వలసినది అటు వారి స్ధితిని. అలాగే మామాలు కాల్ ఐనప్పుడు అటు వారు ఫోన్ ఎత్తేక, తన కాల్ సామాన్యమైనదని, వారికి వీలైతే మాట్లాడదామని, లేదంటే ఇరువురికి వీలైనప్పుడు కాల్ చేసుకుందామని చక్కగా చెప్పాలి. ఇది ఉభయ పక్కల వారికి మనసారా మాట్లాడుకొనే వీలు అవుతోంది కదా.
 • ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చాటుగా విన్న లేదా వినే లేదా వింటున్న లేదా ఆ మాటలు అనుకోకుండా తమ చెవుల్లో పడిన వారు ఆ ఫోన్ కాల్ లో ఉన్న వారు తమ కోసమే మాట్లాడుకుంటున్నారని లేదా తమకు సంబంధించిన విషయాలే చెప్పుకుంటున్నారని తలుస్తూ ఉంటారు. పైగా తమ వారికి తమ గురించి వాళ్లు మాట్లాడు కున్నారని చెప్పేస్తుంటారు, రెచ్చకొట్టేస్తుంటారు. రచ్చ రచ్చకు దారి వేసేస్తుంటారు. అట్టి వారు తప్పక అభద్రత భావంలో కొట్టిమిట్టాడుతున్నట్టే లెక్క.  పైగా వారు తప్పు చేసిన వారి కిందే లెక్క. మరి ఇది ... దొంగా అంటే భుజాలు తడుముకునే చందాన ఉంటుంది  కదా.
 • ఇరు వైపులు విషయం సామాన్యం ఐనప్పటికీ కొందరు ఫోన్ కాల్స్ లో మాట్లాడు కున్నట్టు ఉండదు. అరుచు కున్నట్టు ఉంటుంది. అది చుట్టు పక్కల వారికి ఇబ్బందికరమని వారు గుర్తించాలి. అది ఆమోదకరమైనది కాదని, అలాగే అది ఆరోగ్యకరమైనది కూడా కాదని వారు గ్రహించాలి. చిన్నగా చక్కగా మాట్లాడుతూ, అలాగే అటు వారు గుర్తించేలా నవ్వుతుంటే సరిపోతోంది కదా.
 • ఫోన్ వినియోగదారులు కాల్స్ మాట్లాడు తున్నప్పుడు తెగ ఊగిపోతుంటారు. చేతులు కాళ్లు తెగ ఆడించేస్తుంటారు. ఒంగి పోతుంటారు. కూర్చుండి పోతుంటారు. లేచిపోతుంటారు. చెల్లాచెదురుగా కదిలిపోతుంటారు. పైగా కంట పడే వాటిని తుంచేస్తుంటారు, తుడిచేస్తుంటారు. ఇది అది అని ఏమిటి ఏమిటేమిటో చేసేస్తుంటారు. ఇవన్నీ ఎబ్బెట్టు ఐనవే. ఇక ఇప్పుడు ఐతే పెరిగిపోతూన్న టెక్నాలజీ మూలంగా ఫోన్ కాల్స్ న మన మాటలుతో పాటు మనమూ ఒకరిని ఒకరం అగుపడుతున్నాం, చూసుకుంటున్నాం.  ఐనా మన అట్టి చేష్టలు మరింత పెరిగిపోయాయి. ఇల్లంతా తిరిగిపోతున్నాం. చివరికి గోప్యమైన చోట్లను చూపించేస్తున్నాం. అక్కడ నుండే ఆ కాల్స్ ను కంటిన్యూ చేసేస్తున్నాం. ఇది హర్షణీయమా, ఇది అవసరమా. చెప్పలేం కదా.
ఇలా ఎన్నని ... లిస్టు పెంచడమే తప్పా. సరే కానీ, ఇకనైనా, ఫోన్ అవసరం ఏమిటో గుర్తిద్దామా. ఫోన్ అవసరం ఎంత వరకో బేరేజీ వేసుకుందామా. లేదా ఈ సాంకేతికం సాతం పిండేద్దామా.

***


నా కబురులు కై ఇక్కడ క్లిక్/టచ్ చేయండి


***నా రీతుల్లో, నా తీరుల్లో,  నా శైలిల్లో, మీ దరిన నేను పెడుతున్న నా వివిధ తెలుగు రాతలు ...అనగనగా ఒక  నాన్న (కురచ కథ)ఆ నాన్న ...
తన బిడ్డ తప్పటడుగుల సమయాన్న -
"ఏదీ కాలు ఎత్తు. అడుగు వేయి. నీ చేతులు పట్టుకున్నానుగా. నిన్ను పడనీయను. దా. దా దా" అంటూ తెరిపి ఇవ్వనట్టుగా మురిసిపోయాడు.

ఆ నాన్న ...
తన బిడ్డ అక్షరాభ్యాసం సమయాన్న -
"నీ చేయి పట్టుకున్నానుగా. ఏదీ నేను పలక మీద రాసిన దీని మీదనే నువ్వు దిద్దుతున్నట్టు రాయ్. చాలు. ఆఁ ఆఁ. ఇలా ఇలా. ఆఁ. అంతే అంతే" అంటూ అత్యంత అధికంగా ఆనంద పడిపోయాడు.

ఆ నాన్న ...
తన బిడ్డ సైకిల్ ముచ్చట తీర్చని సమయాన్న - 
"నాన్నా నీ భయమే కానీ నాకు ఏమీ కాదు అంటే వినవు కదా. నేను పెద్ద అయ్యాక  సైకిల్ ఉహూ బైక్ అఁహాఁ కాదు కారు కారు  కొంటాను. నిన్ను పక్కన పెట్టుకొని మరీ తిప్పుతాను" అని అన్నప్పుడు తన కళ్ల నీళ్లని వాడి కంట పడనీయకూడదని  తెగ అవస్థ పడిపోయాడు.

ఆ నాన్న ...
తన బిడ్డ పై చదువుకై మరో ఊరుకు వెళ్లవలసి వచ్చిన సమయాన్న -
"ఎందుకు నాన్నఅంత దిగులు. ఇంత వరకు నా చదువు అంతా నీ చెంతనే సాగించుకున్నావుగా. ఇక తప్పదు. నా పై చదువు ఈ ఊర్లో లేదు. అందుకే వెళ్లాలి. అది మనూరులానే ఉంటుంది. కానీ కాస్తా పెద్దది. అంతే. అఁ" అన్నప్పుడు దొంగతనం చేస్తుండగా  తేలు కాటుకు గురైన దొంగలా అయిపోయాడు.

ఆ నాన్న ...
తన బిడ్డ సిటీలో ఉద్యోగంలో చేరినట్టు చెప్పిన  సమయాన్న -
"నా బిడ్డ ఇప్పుడు సిటీలో ఉద్యోగస్ధుడు. మనలో వాడే అంత దూరాన ఉద్యోగం చేస్తున్నాడు. ప్రారంభంలోనే ఐదు అంకెలలో జీతం. ఆఁ" అంటూ విర్రవీగిపోయాడు.

ఆ నాన్న ...
తన బిడ్డ తండ్రి ఐన సమయాన్న -
"నన్ను తాతను చేసేశావు. థాంక్స్రా" అంటూ తన బిడ్డ గుండెన కరుచుకుపోయాడు.

ఆ నాన్న ...
తన బిడ్డ తన జతతో కూడికైన తన వంతు కుటుంబం కోరి కావాలనుకుంటున్న స్వేచ్ఛకై తనను తాను విస్మరించు కుంటున్న సమయాన్న -
"సమస్యకు భయపడి కాదు, సమస్యను ఎదురుకొనే సత్తాలేక కాదు. నా బిడ్డకై చావడానికైనా సిద్ధపడ్డ నాకు ఇదేం బాధ కాదు. అంతే, అంతే" అంటూ ఆ నిర్వాహకుడుతో చెప్పి నిటారై ...  అటుపై మౌనిఐ ...  ఆ ఆశ్రమంలోకి కదిలిపోయాడు.
***


నన్ను ఆకట్టుకున్న మరియు ఆలోచింపజేసిన, చాలా వరకు ఉపయుక్త మైన విషయాలు ...


ఆవులింత

 • శరీరంలో కలిగే ఒక అసంకల్పిత చర్యని ఆవులింత అని అంటున్నారు.
 • శారీరకంగా అలసినప్పుడు లేదా మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు సామాన్యంగాా  ఆవులింత వస్తుంటుందని అంటున్నారు. 
 • ఈ ఆవులింత అంటు వ్యాధి వంటిదిగా తోస్తుంటుంది. కారణం ఈ ఆవులింతని చూసినా లేదా ఈ ఆవులింత గురించి ఆలోచించినా తప్పక ఈ చర్య ఐ తీరుతోంది లేదా అగుపిస్తోంది.
 • ఆవులింతకి కారణం మెదడు ఉష్ణోగ్రత పెరగడం అంటున్నారు. 
 • అట్లానే కావలసినంత  ఆక్సిజన్ సరఫరా కాకపోవడం మూలంగా ఆవులింత వస్తోందని కూడా అంటున్నారు.
 • ఆవులింత శరీరంలో  వచ్చిన అసౌకర్యానికి ఒక హెచ్చరిక అని నిక్కచ్చిగా అంటున్నారు.
 • తెరిపి ఇవ్వని ఆవులింతలు వస్తున్నాయంటే ప్రమాదకర స్థితి ఒకటి ముంచుకు వస్తున్నట్టు తప్పక అనుమానించాల్సి వుంటుంది అని  అంటున్నారు.
 • ఇబ్బందికరమైన లేదా ఆటంకకరమైన ఆవులింతలు వస్తుంటే మాత్రం తక్షణం ఆమోదపరమైన చర్య చేపట్టితే ఆరోగ్యపరమైన సమస్య జటిలమవ్వదని విశ్వసనీయంగా  వక్కాణించబడి ఉంది.
***

***
                     
రేపటి టపా*
***
* ఆదివారం విరామం

నా బ్లాగులో మీ పేరుతో ప్రచురణకై ఉపయుక్తమైన, సమ్మతమైన సందేశం లాంటి మీ కొద్దిపాటి తెలుగు రూపం కై ...

పేరు

ఇమెయిల్ *

సందేశం *

ధన్యవాదములు

నా బ్లాగు లోకి మీకు సదా స్వాగతం